భక్తుల పాపాల్ని దక్షిణగా స్వీకరించే దయామయి సాయి
బాబా దక్షిణగా డబ్బునే కాక చెడు లక్షణాలను, సద్గ్రంథాలలోని మంచి విషయాలను ఆచరించటమనే లక్ష్యంతో కూడా దక్షిణలను స్వీకరించేవారు. ఒకసారి బాబా ఫ్రొఫెసర్ నార్కేను పదిహేను రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు.
"అయ్యో నావద్ద సమయానికి పైసా కూడా లేదే?! ఏం చేయాలి" అని నార్కే బాధపడ్డాడు.
"నీదగ్గర డబ్బులు లేవన్న విషయం నాకూ తెలుసు. ప్రస్తుతం నువ్వు 'యోగవాశిష్టం' చదువుతున్నావు కదా ! ఆ పుస్తకం చదివి నేర్చుకున్న పదిహేను విషయాలను దక్షిణగా ఇవ్వు" అని అడిగారు బాబా.
ఇక్కడ బాబా కోరిన దక్షిణలోని పరమార్థం యోగవాశిష్టం చదివి నేర్చుకున్న అంశాలను జాగ్రత్తగా హృదయంలో పదిలపర్చుకుని వాటిని ఆచరిస్తున్నామా? లేదా? అనేది పరీక్షించటానికే! బాబా నార్కేను కోరిన ఆ పదిహేను లక్షణాలు ఏమిటంటే....
1. ఆశలేకపోవటం,
2. నిర్భయత్వం,
3. నిత్యత్వం,
4. సమత్వం,
5. జ్ఞానం,
6. ఏకాగ్రత,
7. కర్తవ్యం,
8. సదా ప్రసన్నంగా ఉండటం,
9. వికల్పరాహిత్యం,
10. ధైర్యం,
11. సర్వ భూతదయ,
12. ఉత్తమ బుద్ధి,
13. సంతుష్టి,
14. మృదుత్వం,
15. మృదు భాషణం.
యోగవాశిష్టం ఈ లక్షణాలనే నేర్పుతుంది. నార్కే ఈ సుగుణాలను అలవర్చుకుంటున్నాడా? లేదా? తెలుసుకోవటానికే బాబా అతనిని దక్షిణ అడిగారన్న మాట. మరోసారి ఆత్మారామ్ తర్ఖడ్ భార్య బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది.
"అమ్మా ! నీలోని ఆరు గుణాలను నాకు దక్షిణగా ఇచ్చేయ్" అని అడిగారు బాబా.
తర్ఖడ్ భార్యకు ఏమీ అర్థం కాలేదు. పకనే ఉన్న ఆమె భర్త బాబా అడిగిన దక్షిణ భావంలోని అంతరార్థాన్ని భార్యకు ఇలా చెప్పాడు.
"బాబా నీ మనసులో ఉన్న కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాతర్యాలనే లక్షణాలను తనకు దక్షిణగా ఇచ్చేసి మోక్షం పొందమంటున్నారు. అదే బాబా నిన్నడిగిన దక్షిణలోని భావం" అని ఆత్మారామ్ తర్ఖడ్ వివరించాడు. ఇవి ప్రతి మనిషిలో ఉండే ఆరు గుణాలు. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషి ఎప్పుడూ వీటికి బానిసై ఉంటాడు. వీటి బారిన పడితే మోక్షం పొందలేం కాబట్టి వాటిని తనకు దక్షిణగా ఇచ్చేసి మోక్షం పొందమన్నారు బాబా. ఇంకోసారి బాబా ఒక భక్తిడికి 'జ్ఞానేశ్వరి' గ్రంథాన్ని ఇచ్చారు.
"ఆ పుస్తకంలో ఉన్న తొమ్మిది విషయాలను చదివి, మననం చేసుకుని నేర్చుకుని ఆచరించు. అదే నువ్వు నాకిచ్చే దక్షిణ" అని చెప్పారు. బాబా మన నుంచి దక్షిణ కోరేది మన కర్మల ధ్వంసానికే. పాపాల్ని దక్షిణగా అడిగి తీసేసుకుని భక్తుల్ని పావనుల్ని చేసే దయామయి సాయి.

No comments:
Post a Comment