Pages

Sunday, April 21, 2013

శ్రీ సాయి మంగళ హారతి

శ్రీ సాయి మంగళ హారతి

షిరిడీ క్షేత్ర వాసుడైన, లోకనాథుడైన, బ్రహ్మ స్వరూపుడు, భక్తులచే, నాగ లోక వాసులచే కొలవ బడిన, ముక్తి మార్గ బోధకుడు అయిన శ్రీ సాయి నాథుని మన అభీష్టాలని తీర్చేందుకు నమస్కరిస్తూ ఇచ్చే ఈ మంగళ హారతి  పాట 'రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ' ట్యూన్ లో పాడవలెను.


స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్ర వాసాయ
మామకాభీష్టదాయ మహిత మంగళమ్           || స్వామి ||

లోక నాథాయ భక్తలోక సంరక్షకాయ
నాగలోక స్తుత్యాయ నవ్య మంగళమ్             || స్వామి ||

భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళమ్        || స్వామి ||
 
సత్య తత్వ బోధకాయ సాధు వేషాయతే
నిత్య మంగళదాయకాయ నిత్య మంగళమ్        || స్వామి ||

మహిత మంగళమ్! మహిత మంగళమ్!
మ  హి  త  మం  గ  ళ  మ్!

Worship at Gurusthan (Shirdi) - 3rd Day of Ramnavmi Festival 2013


Worship at Gurusthan (Shirdi) - 3rd Day of Ramnavmi Festival 2013

శ్రీ సాయి నాధుని " దివ్య మంగళ స్వరూపం "

శ్రీ సాయి నాధా !
ఆ.వె. భాను బింబ మంత ప్రజ్జ్వలత్ కాంతులు
చంద్ర బింబ మంత చల్ల దనము
నీదు శిరసు నందు నెగడొంద గంటి రా
శ్రీని వాస సయి ! శిరిడి రాజ !

ఆ.వె. ఉత్త మాంగ కాంతు లుజ్జ్వ లింపగ నీక
నెట్టన తల గుడ్డ కట్టి నావు
ప్రజ్జ్వ లించు ప్రభలు పరిహృత మయ్యేన ?
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె. ఫాల భాగ మందు పారాడు శాంతమ్ము
కట్టు చేల దాచి పెట్ట లేక
మోము దమ్మి నరసి మురిసేని విరిసేని
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . శ్రీ కరములు భవ హరములు
శ్రీ కేతన మెత్తి నట్లు చెలువము లై శ్రీ
లా కారము దాల్చెనొ యన
సాకారపు శృతుల గంటి జయముర సాయీ !

కం . జగతికి వెలుగులు ‌‌. అగతిక
జగతికి జగ మెరిగి నట్టి సద్గతు లై శీ
ఘ్ర గతిం గాచు కటాక్షపు
సుగతులు నీనయన గతులు శుభకర సాయీ !

ఆ.వె. తీరి విరిసి నట్టి తెల్ల దామరల లో
దూరి తిరుగు నట్టి తుమ్మెద లన
కడు మనో మైన కంటి పాపలు గంటి
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . నన సంపెగ సొబగున నా
నన మున కోటేరు దీర్చు నవ్విధి సొబ గై
కొన దేరి నాసి కాగ్రము
ఘన దీక్షను జాట గంటి ఘనముగ సాయీ !

కం . అధరములో మధు రోక్తుల
సధనములో త్రిభువన హిత సంభాషణ ది
వ్య ధిషణ వేదములో యన
నధర మధుర బింబ ఫలము లరసితి సాయీ !

కం . పలు జన్మల తపమున పు
వ్వులు నీ గళ సీమ జేరు పుణ్యము బడసెన్
వలమురి శంఖమొ యన మం
గళ మయ గళ సీమ గంటి ఘనముగ సాయీ !

కం . భూజనుల కండ దండలు
ఈ జగతిని నాదు కొనగ నేర్పడినవి నీ
యాజాను బాహు దండలు
మా జన్మకు సుగతు లట్లు మాన్యుడ సాయీ !

ఆ.వె. అభయ ముద్ర దాల్చి యరచేత దక్షిణ
హస్త మెత్తి జగతి నాదు కొనెడు
నీదు చేతి చలువ పాదు కొంటిర తండ్రి !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . పాయని దయకు నిధానము
హాయికి కడ లేని చోటు అమృత మయ మౌ
నీ యేద పై తల నానిచి
హాయిగ ఏడ్వంగ నాకు ఆశర సాయీ !

ఆ.వె. ఎడమ కాలి తొడకు కుడి కాలు కీలించి
పైన నెడమ చేయి పాదు కొల్పి
కొంద రాయి నెక్కి కూర్చుంటివా తండ్రి !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

కం . నీ పదములు శ్రీ పధములు
ఈ పృధ్వికి యెన్న దగిన యేడు గడలు మా
కాపద మొక్కుల తెరువులు
మా పాలిటి కల్ప తరులు మాన్యుడ సాయీ !

ఆ.వె. హే సమస్త విశ్వ సృష్ఠి కారక ప్రభో !
హే సంస్త ప్రాణి హృదయ వర్తి !
తే నమోస్తు దివ్య తేజో శుభాకార 1
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !