Pages

Sunday, September 8, 2013

వినాయకచవితి శుభాకాంక్షలు

 

శ్రీ సాయి చాలీసా

షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి
దరిశన మియ్యగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడి||
కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీ నివాసం భక్తుల మదిలో నీ రూపం ||షిరిడి||
చాంద్ పాటిల్‌ను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని
గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం ||షిరిడి||
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవ
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం ||షిరిడి||
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలచెను శ్రీ సాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ||షిరిడి||
ప్రళ
కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ నాశం కాపాడీ షిరిడీ గ్రామం
అగ్ని హొత్రి శాస్త్రికి లీలా మహత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి ||షిరిడి||
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం
ఊదీ వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు
కాకాజీకీ ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం ||షిరిడి||
కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు,
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొని నిను మేఘూ తెలుసుకొని అతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము ||షిరిడి||
డాక్టరకు నీవు రామునిగా బలవంతుకు శ్రీ దత్తునిగా

నిమోనుకరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా
మార్తాండ్‌కు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోహికి దరిశనమిచ్చిన శ్రీ సాయి ||షిరిడి||
రేయి పగలూ నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి ||షిరిడి||
అందరిలోన నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలిచెదము నిత్యము సాయిని కొలిచెదము ||షిరిడి||
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధినుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి ||షిరిడి||
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి ||షిరిడి||
వందనమయ్యా పరమేశా ఆపద్భాంధవ సాయీశా
మా పాపములూ కడతేర్చు మామది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి
మా మనస్సే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం ||షిరిడి||