Pages

Wednesday, June 12, 2013

భక్తుల పాలిట కల్పతరువు షిరిడీ సాయిబాబా





సాక్షాత్తు దేవతాస్వరూపుడైన షిరిడీ సారుుబాబా భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచారు. భారతీయ ఆధ్మాత్మిక గురువుగా, సాధువుగా, ఫకీరుగా విభిన్న అవతారాలలో భక్తులకు ఆయన దర్శనమిచ్చారు. ఆయన బతికున్న కాలంలో సారుుబాబాను ముస్లింలు ఫకీరుగా భావిస్తే హిందువులు సాధువుగా నమ్మారు. కానీ ఆయన తన జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి సహయోగం కుదర్చడానికి ప్రయత్నించారు. సారుుబాబా మసీదులో నివసించారు...గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు

ఆయన రెండు సంప్రదాయాల పదాలను, చిత్రాలను ఉపయోగించారు. సారుుబాబా వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యంఅల్లా మాలిక్‌, సబ్కా మాలిక్ఏక్‌’ అనేది బహుళ ప్రాచుర్యంలో ఉంది. దీనర్థం అందరి ప్రభువు ఒక్కరే అని. ఎక్కువమంది భక్తులు సారుుబాబాని శివుని, దత్తాత్రేయుని అవతారం అరుున సద్గురువుగా భావిస్తారు. ఇక షిరిడీ సారుుబాబా ఎక్కడ పుట్టారో, ఎప్పుడో పుట్టారో తెలియదు. కానీ ఆయన షిరిడీలో మహా సమాధి అరుున రోజు మాత్రం అకో్టబర్‌ 15,1918.

షిరిడీ సాయిబాబా బోధనల్లో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అదె్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, గురాత్‌, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.

జీవిత చరిత్ర...
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడం లేదు. విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుపక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి. ఇక తన జన్మ, బాల్యం గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవారు. ఎందుకంటే ఎక్కడ పుట్టారో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు, వారిది మతం అని మనసులో నాటేసుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా బాబా తన పేరు, పుట్టిన ప్రదేశం గుర్తించి ప్రస్తావన చేయలేదు.

ఒకసారి తనకు ప్రియమైన అనుయాయుడైన మహాల్సాపతితో తాను ప్రతి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది. మరొకసారి ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్లు శిష్యరికం చేసినట్లు చెప్పాడంటారు. రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి. పదహారు సంవత్సరాల వయసులో సాయిబాబా మహారాష్టల్రోని అహ్మద్నగర్జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చారని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం కనిపించలేదని, మళ్లీ ఒక సంవత్సరం తర్వాత (1858)లో ఆయన షిరిడీకి తిరిగి వచ్చారని అత్యధికులు విశ్వసించే విషయం. లెక్కన బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చని అంటారు.

యువకుడైన బాబా ఒక వేప చెట్టు కింద ధ్యానంలో రాత్రింబవళ్లు కూర్చొని ఉండేవారు. అతనిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్థులు బాబాను తరచు దర్శించేవారు. ఇక కొంతకాలం కనిపించకుండా పోయిన సమయంలో ఆయనెక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. అప్పుడు ఆయన చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని చెబుతారు. మరొకొందరు 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగిన మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చని అంటారు.

షిరిడీలో నివాసం...
1858
లో చాంద్పాటిల్కుటంబపు పెళ్లివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర అతను బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతిదయ చేయుము సారుూఅని పిలిచారు. తరువతసాయిపదం స్థిరపడి ఆయన షిరిడీ సాయిబాబాగా ప్రసిద్దిలైనారు. ఇక 1918లో సమాధి అయ్యే వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసంగా చేసుకున్నారు. మసీదులో ధునిని వెలిగించేవారు. అందులో నుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు.

అది తమకు రక్షణనిస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చినవారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. ఆయన చాలా మహత్తులు చూపేంచేవారని భక్తులు చెబుతారు. ఇక బాబా స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒక్కోసారి బాబా విపరీతమైన కోపాన్ని ప్రదర్శించేవారు. 1910 తర్వాత దేశమంతటా సాయిబాబా పేరు తెలిసిపోయింది. గొప్ప మహత్తులు చూపే సాధువని లేదా దేవుడి అవతారమని విశ్వసించే భక్తులు ఎంతో మంది బాబా దర్శనానికి రాసాగారు.

సాయి బోధనలు...
షిరిడీ సాయిబాబా భక్తులకు ఎన్నో బోధనలు చేశారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంథ పఠనం చేయాలని చెప్పారు. రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయాలని హిందూ భక్తులకు ఉపదేశించారు. ఖురాన్చదవమని ముస్లింలకు చెప్పారు. నీతి బద్దమైన జీవనం గడపమని, ఇతరులను ప్రేమించి సహాయం చేయమని బోధించారు. తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవరుచుకోమని పదే పదే చెప్పారు. అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు,సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలని ఉపదేశించారు. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అదె్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామయి అని పేరు పెట్టుకోవడం విశేషం.

మహా సమాధి...
షిరిడీ సాయిబాబా 1918 సంవత్సరం అక్టోబర్‌ 15 మధ్యాహ్నం 2.30కి తన భక్తుని ఒడిలో కన్నుమూసి మహా సమాధి చెందారు. ఆయన దేహాన్ని షిర్డీలో సమాధి చేసి మందిరాన్ని నిర్మించారు. మందిరమే నేడు షిర్డీ సాయిబాబా దేవాలయంగా ఎంతో పేరుగాంచింది
బాబా తన భక్తులకు 11 వాగ్దానాలు చేశారు. అవి...
  • షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
  • మందిరం మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది
  • నేనీ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా సచేతనంగా ఉంటాను
  • నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
  • నా సమాధి నుండే నేను మీకు దర్శనమిస్తాను
  • నా సమాధి నుండి నేను మాట్లాడుతాను
  • నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను
  • మీరు నా వంక చూడండి. నేను మీవంక చూస్తాను
  • మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను
  • నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి
  • నా భక్తుల ఇంటలేమిఅనేది ఉండదు.

Sai devotee from Andhra Pradesh Mr.Subashchandra Bose has donated 700 gm. Weighted Golden Crown worth Rs.23 lakh to Shri Saibaba in Shirdi courtesy by Sai ke Diwane