Pages

Monday, July 22, 2013

బాబాతో సాయి బా.ని.స. అనుభవాలు 9

బాబాతో సాయి బా.ని.. అనుభవాలు 9



బాబా తన భక్తులకిచ్చిన హామీల గురించి 'సాయి సచ్చరిత్ర 15 అధ్యాయం లో ప్రముఖంగా చెప్పబడింది. ఒక్కసారి కనక యెవరినైనా బాబా తన భక్తునిగా స్వీకరిస్తే, అతను సప్త సముద్రాల అవతల యెక్కడ ఉన్నా సరే, బాబా భక్తునివెంట నీడలా నిరంతరం అనుసరిస్తూ ఉంటారు. ఒకసాయి భక్తునిగా నేనీ విషయాన్నిబలపరుస్తూ, నా జీవితం లో జరిగిన ఒక సంఘటనను మీకు తెలియపరుస్తున్నాను.

నా విదేశ యాత్రమొదటి అనుభవంలో దక్షిణ కొరియా ప్రయాణం గురించి వివరించాను. దానిని మరొక్కసారి తిరిగి గుర్తుకు తెచ్చుకుందాము. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన దానికి అనుబంధం. 06.05.1991 చాంగ్వాన్ పట్టణములోని హొటలు గదిలోకి ప్రవేశించగానె ఒక పెద్ద పరిమాణంలో ఉన్నకందిరీగ ఒకటి నాచుట్టూ రెండు సార్లు ప్రదక్షి ణాలు చేసి గదిద్వారమునుండి బయటికి వెళ్ళిపోయింది. నేను సియోల్ నుండి పుసాన్ పట్టణానికి విమానములో ప్రయాణిస్తూ "బాబా నేను చాంగ్వాన్ పట్టణానికి చేరే సమయానికి నాకంటె ముందుగా నీవక్కడకు చేరుకుని నాకు దర్శనమివ్వగలవా" అని బాబాని కోరాను. ఇప్పుడు గది తలుపు తెరవగానే నా చుట్టూ రెండు ప్రదక్షిణాలు చేసి గది ద్వారముగుండా బయటకు వెళ్ళిన కందిరీగ, బాబా కాదు కదా అని ఆలోచించాను. ఇదంతా నా భ్రమ అని భావించాను. విషయము ఒక సాధారణ వ్యక్తికి హాస్యాస్పదముగా అనిపించవచ్చును. సాయి భక్తులకి మాత్రము ఇందులోనిజం ఉన్నదని గ్రహించగలరు. సాయి సచ్చరిత్ర 46 అధ్యాయంలో యిటువంటి సంఘటన వివరింపబడింది. నానా సాహెబ్ చందోర్కర్, కాకా సాహెబ్ దీక్షిత్ బాబాను తమతోపాటు నాగపూరు, గ్వాలి యర్, గయ పట్టణాలకి రమ్మని కోరినప్పుడు బాబా అన్న మాటలను (46 అధ్యాయం 379 పేజీ) ఒక్కసారి గుర్తు చేసుకుందాము. "నా తరఫున మీరు శ్యామాను మీతో తీసుకుని వెళ్ళండి. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటే ముందుగానే అతనిని గయలో కలుసుకుంటాను. " మాటలను గుర్తుంచుకొనవలయును. ఏలనన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును.

చాంగ్వాన్ పట్టణములో నా ఆఫీసు వ్యవహారలన్నిటినీ ముగించుకుని 16.05.1991 నాడు తిరిగి భారత దేశానికి వచ్చే ప్రయత్నంలో ఉన్నాను. 16.05.1991 తెల్లవారుజామున 5 గంటలకు నేను కాకడ ఆరతి చదవడం పూర్తి అయిన తరువాత నేను చాంగ్వాన్ పట్టణములో హొటలు గదిలో ప్రవేసించిన సమయములో (ఆరోజున 06.05.1991) నా చుట్టూ ప్రదక్షిణాలు చేసిన కందిరీగ తిరిగి మరలా కాకడ ఆరతి పూర్తయినవెంటనే నాచుట్టూ రెండు ప్రదక్షిణాలు చేసి కిటికీ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. సంఘటనకు నేను నిశ్చేస్టుడినయ్యాను. ఆనాడు శ్రీ సాయి గయలోని పాండా యింటిలో సాయి పటము రూపములో శ్యామాకు దర్శనమిచ్చి తనన్న మాటలను ఋజువు చేసుకున్నారు. చాంగ్వాన్ పట్టణము హొటలు గదిలో నా కంటె ముందుగా శ్రీ సాయి కందిరీగ రూపములో వచ్చి తిరిగి నాకంటె ముందుగా 16.05.1991 నాడు యిండియాకు బయలుదేరారని గట్టి నమ్మకమేర్పడింది. శ్రీ సాయి అన్ని జీవులలోనూ ఉన్నారనే మాటలు నాలో ప్రతిధ్వనించాయి. సాయి సర్వ వ్యాపి అని నిరూపించుకున్నారు.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 8

సాయితో సాయి.బా.ని.. అనుభవాలు - 8
శ్రీ షిరిడీ సాయి సశరీరంతో షిరిడీలో ఉన్న రోజులలో బాబా గారి అనుమతితో షిరిడీ ప్రజలు బయట గ్రామాలకు వెళ్ళేవారుమరియు వారిని దర్శించుకోవడానికి వచ్చినవారు వారి అనుమతి ఆశీర్వచనాలనూ తీసుకున్నతరవాతనే తిరిగి తమస్వగ్రామాలకు వెళ్ళేవారు. అది ఒక నియమంలా ఉండేది. పధ్ధతిని పాటించినవారంతా యెటువంటి కష్టాలూ లేకుండాతమ యాత్రలను పూర్తి చేసుకునేవారు. శ్రీ సాయి ఆదేశాలను పాటించనివారు అనేక కష్టాలను యెదుర్కోవలసి వచ్చేది. విషయాలన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో విపులీకరంగా చెప్పబడింది. 1992 లో బాబాగారి ఆదేశానికి వ్యతిరేకముగా నేనుకొనసాగించిన ప్రయాణము వివరాలు మీకు తెలియపర్చదలచుకున్నాను.
అది 1992 సంవత్సరము ఏప్రిల్ నెల. నాభార్య బలవంతము వలన నంద్యాల పట్టణములో ఉన్న నాకు కాబోయేఅల్లుడి గురించిన వివరాలు సేకరించడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అప్పటికే వివాహము నిశ్చయముఅవడం వల్ల అలాచేయడం భావ్యం కాదనుకున్నాను. కాని నా భార్య వెళ్ళితీరవలసిందే అని పట్టు పట్టింది. ఈసందిగ్ధావస్తలో నాకు సలహాను ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించి కళ్ళుమూసుకుని శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరిచాను. అది 9 అధ్యాయములో 84 పేజీ. అందులోని సందేశము "పల్లె విడిచి బయటకు పోవలదు “. సందేశముద్వారాబాబా నన్ను నంద్యాల పట్టణానికి వెళ్ళవద్దని ఆదేశించుచున్నారని గ్రహించాను. కాని నా భార్య బలవంతం మీద నాకాబోయే అల్లుడి వివరాలు తెలుసుకొనుటకు రాత్రి నంద్యాల పట్టణమునకు బయలుదేరాను. మరుసటి ఉదయమునాడు (మహాశివరాత్రి పర్వదినము ) నా అల్లుడుగారి యింటికి వెళ్ళాను. ముందుగా తెలియపరచకుండా హటాత్తుగా వారియింటికి చేరుకోవటము వారికి కొంచెం ఇబ్బంది కలిగించింది. నేను మహానందిలో మహాశివరాత్రి పుణ్యదినమునపూజలు చేయించడానికి మహానందికి వెడుతూ అతనిని చూడటానికి వచ్చినానని అబధ్ధము చెప్పినాను. ఆయనఆరోజున తన స్నేహితులతో కలిసి అహోబిలం వెళ్ళడానికి నిశ్చయించుకుని నన్ను కూడా వారితో కలిసి రమ్మనిచెప్పినారు. నేను వారి ఆహ్వానానికి అంగీకరించి వారితోను వారి స్నేహితులతోను కలిసి అహోబిలము చేరుకున్నాను. అహోబిలములో శ్రీ నరసిం హస్వామికి పూజలు పూర్తి చేసుకుని మధ్యాహ్న్నము 12 గంటల తరువాత బస్సు స్టాండ్ కువచ్చినాము. సాయంత్రము 4 గంటల వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు లేవని తెలుసుకుని అందరమూ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి కాలినడకన బయలుదేరాము. మండుటెండలో నేనునడవలేకపోవుచున్నాను. బాగా అలసిపోయి నిస్సత్తువగా ఉన్నాను. తాగడానికి మంచినీరు లేదు. సేదతీర్చుకుందుకూ చెట్లకు ఆకులు లేక నీడ కూడా లేదు. మార్గము గుండా పోవుతున్న చిన్న వాహనములవారుఎవ్వరూ మాకు సహాయము చేయడాని తమ వాహనాలను ఆపలేదు. నాకు కాబోయే అల్లుడు అతని మిత్రులువడివడిగా ముందుకు నడవసాగారు. నేను మండుటెండలో నడవలేక రోడ్డుకు అడ్డముగా నిలబడి శ్రీసాయినామమును జపింప సాగినాను. నా అదృష్టము వశాత్తు ఒక లారీ నా ముందు ఆగినది. నేను కనులు తెరిచి ఆలారీ వైపు చూసినాను. లారీపై శ్రీ షిరిడీ సాయినాధులవారి అభయహస్తముతో ఉన్నపటము మరియు శ్రీ షిరిడీసాయి లారీ సర్వీసు

అనే అక్షరములు చూసి తన్మయత్వములో కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయినాను. నా కాబోయేఅల్లుడు వారి మిత్రులు లారీ డ్రైవరు అందరూ కలిసి నన్ను లారీలో పరుండబెట్టినారు. లారీ డ్రైవరు మమ్ములనిదగ్గరలో ఉన్న గ్రామములో చేర్చినాడు. లారీ డ్రైవరు నన్ను దగ్గిరలో ఉన్న హోటలుకు తీసుకుని వెళ్ళి తాగడానికి ఒకసోడా కొని పెట్టి తన చేతి సంచీనుండి ఒక గజ నిమ్మపండు ఇచ్చి నా చేత నిమ్మరసము తాగించాడు. లారీ డ్రైవరుమమ్మలని అక్కడ వదలిపెట్టి వెడుతూ అన్నమాటలు " ఇక మీదట నీగురువు మాటలను పెడచెవిని పెట్టి యిటువంటికష్టాలను కొని తెచ్చుకోవద్దు." మాటలకు నేను నిశ్చేష్టుడినయ్యాను. సాక్షాత్తూ శ్రీ సాయినాధులవారే లారీ డ్రైవరురూపములో వచ్చి నన్ను కాపాడినారని తలచి వారికి నా రెండు చేతులతో నమస్కరించి కృతజ్ఞతలుతెలియచేసుకున్నాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 7

సాయితో సాయి.బా.ని.. అనుభవాలు - 7
సాయి ఆపదలో ఉన్న తన భక్తుల పిలుపుకు వెంటనే స్పందిస్తారని మనకందరకూ తెలుసు. బలరాంమా న్ కర్మశ్చీందర్ ఘర్ లో ధ్యానము చేసుకున్న తరువాత దాదర్ లోని తన యింటికి బయలుదేరాడు. పూనే రైల్వే స్టేషన్ కి చేరుకుని దాదర్ కువెళ్ళే రైలు కోసం యెదురుచూడ సాగాడు. రైలు టిక్కట్టు కొనడానికి ప్రయత్నించినా విపరీతమైనజన సమూహంలో టిక్కట్టు కొనలేకపోయాడు. మానసిక ఆందోళనతో తాను తన యింటికి వెళ్ళలేనని బాధపడసాగాడు. తనను కష్టాన్నుండి గట్టెక్కించమని సాయిని ప్రార్థించాడు. మరుక్షణమే సాయి ఒక పల్లె టూరివానిరూపములో ప్రత్యక్షమై తన వద్ద దాదరు వరకూ టిక్కట్టు ఉన్నదని కొన్ని కారణాంతరాలవల్ల తను ప్రయాణంచేయలేకపోతున్నానని చెప్పి టిక్కట్టునతని చేతిలో పెట్టాడు. మాన్ కరుకు యేమి జరిగిందో తెలుసుకునేలోపల అపరిచిత వ్యక్తి జన సందోహంలో మాయమయిపోయినాడు. పల్లెటురివాడిచ్చిన టిక్కట్టుతో మాన్ కర్ తన యింటికిక్షేమంగా చేరుకున్నాడు. ఇది సాయి సచ్చరిత్ర 31 అధ్యాయంలో వివరింపబడింది.
సరిగా నాకు కూడా యిటువంటి అనుభవమే కలిగింది. సాయి భక్తులందరితోనూ దానిని నేనిప్పుడు పంచుకోదలిచాను. 1991 సంవత్సరంలో గోదావరీ నది పుష్కరాలకు వెళ్ళి రాజమండ్రీ రైల్వే స్టేషన్లో సికందరాబాదు రైలుకోసంనిరీక్షిస్తున్నాను. మన భారత దేశంలోని అన్ని నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి యిటువంటి పుష్కరాలుజరుగుతాయి. రాజమండ్రీ రైల్వేస్టేషన్లో నా బంధువు ఒకరు నాకు ఒక పెట్టెను ఇచ్చి దానిని సికందరాబాదులోని తనబంధువుల యింటికి చేర్చమని కోరినాడు. నేను పని చేయటానికి అంగీకరించాను. రైలు మరునాడు ఉదయముఏడు గంటలకు సికందరాబాదు స్టేషనుకు చేరుకున్నది. నేను కూలివాని సహాయంతో పెట్టెను తీసుకుని స్టేషనుబయటికి వెళ్ళడానికి గేటు దగ్గిరకు వచ్చినప్పుడు అక్కడ టిక్కట్టు కలెక్టరు నన్ను ఆపి పెట్టి 30 కిలోలకన్నయెక్కువ బరువు ఉండునని, దానిని తూకము వేయవలెనని ఆదేశించినాడు. నా దగ్గి రున్నసంచీ మరియు పెట్టెనుతూకము వేయగా 39 కిలోల బరువుంది. అదనపు బరువుకు 150 రూపాయలు అపరాధ రుసుము చెల్లించవలెననిఆజ్ఞాపించినాడు. సమయములో నా వద్ద 20 రూపాయలు మాత్రమే ఉంది. నేను టిక్కట్టు కలెక్టరును యెంతప్రాధేయ పడినా అతను నన్ను గేటు బయటకు వెళ్ళడానికి అంగీకరించలేదు. తోటి ప్రయాణీకులందరూ నన్ను ఒకదొంగగా భావించి పలు రకములైన వ్యాఖానాలు చేయసాగారు. అటువంటి ఆపద సమయములో నేను మనసారా శ్రీసాయిని ప్రార్థించి కష్టమునుండి గట్టెక్కించమని వేడుకున్నాను. సమయం లో టిక్కట్టు కలెక్టరుయొక్క పైఅధికారి అటువైపు వచ్చి నా భుజముపై చెయ్యి వేసి దగ్గిరలో ఉన్న ఫ్రిడ్జ్ లో నించి ఒక గ్లాసు మంచినీరు ఇచ్చి పెట్టినీది కాదన్న విషయం నాకు తెలుసు. నీవు ఆందోళన చెందవలదు అని చెప్పి టిక్కట్టు కలెక్టరుతో ఏదో మాట్లాడి గేటుబయట వరకు వచ్చి నన్ను యింటికి వెళ్ళమని చిరునవ్వుతో చెప్పినాడు. క్షణములో నా సాయినాధులవారే ఈటిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆకష్టమునుండి రక్షించి నన్ను ఆశీర్వదించారనే భావనకలిగింది. నన్ను విధంగా రక్షించిన పెద్ద ఆఫీసరు నా సాయి తప్ప మరెవరు? చేతులు జోడించి సాయికిమనస్పూర్తిగా నమస్కరించాను.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు