Pages

Thursday, August 22, 2013

షిర్డీలో దర్శనీయ పుణ్యస్థలాలు


షిర్డీసాయితో సహచర్యాన్ని పంచుకుని వారి జ్ఞాపకాలను ప్రతిబింబించే ప్రదేశాలు, కట్టడాలు, ఆలయాలు షిర్డీలో ఎన్నో ఉన్నాయి.వీటిలో కొన్ని సాయి నివసించిన మసీదుకీ, ఇప్పటి సమాధి మందిరానికీ దగ్గరలోనే ఉన్నాయి. సాయి జీవనంతో అల్లుకున్న ఈ నిర్మాణాలను, ప్రదేశాలను తిలకించడం ఒక అపురూప దివ్యానుభూతి, షిర్డీ వెళ్ళిన యాత్రికులందరూ చూడదగిన ప్రదేశాలివి.
సమాధిమందిరం:
షిరిడీ ఉన్న ప్రదేశాలలో సమాధి మందిరానికే అత్యంత విశిష్ట స్థానం. 1914 లో ఇప్పుడు సమాధి మందిరం ఉన్న ప్రదేశంలో ఒక పూలతోట ఉండేది. ఈ తోట బాబా స్వయం కృషి ఫలితం. అక్కడ నేల చదును చేసి పూల మొక్కలు నాటి ఓజూ శ్రద్దగా నీరుపోసేవారు. నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడు గోపాలరావు బూటీని ఈ మందిరం నిర్మిచమని బాబా ఆదేశించారు. 1918 కల్లా ఆ మందిరం రాయారైంది, అక్కడ మురళీధరుని ప్రతిష్టించాలని బూటీ ఆశించాడు బాబా ద్వారకామాయిలో అంతిమశ్వాస విడుస్తూ ‘నన్ను ఆ రాతిమేడలోకి తీసుకెళ్ళండి’ అన్నారు. అందుకే వారి సమాధి అక్కడ అవతరించింది.
సమాధి మందిరంలో రారాజులా భాసిస్తూ మనకు గోచరించే సాయిమూర్తిని 1954 ప్రతిష్టించారు. శిల్పి శ్రీ తాలిమ్ విగ్రహం చెక్కే సమయంలో అడుగడుగునా బాబా ఆదేశాలిస్తూ, సూచనలు చేసేవారట. బాబా విగ్రహానికి అభిషేకం చేస్తుండగా తలమీద నుంచి జాలువారుతున్న పాలను చూస్తుంటే బాబా కనురెప్పలు కదలాడుతున్నట్లు అనుభూతి కలుగుతుంది. సాయి ప్రేమికులందరికీ ఈ విగ్రహం ఒక గొప్ప కానుక.
ఖండోబా ఆలయం:
1872 సంవత్సరంలో ఔరంగాబాద్ జిల్లా ధూప్ ఖేడా గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే ఆయన తన బావమరిది కొడుకు పెళ్ళి కోసం ఎడ్లబండిలో తరలి వస్తుండగా ఆ పెళ్ళిబళ్ళతో పాటు బాబా కాలుపెట్టారు. ఖండోబా ఆలయ సమీపంలో మర్రిచెట్టు కింద బళ్ళు ఆగాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న అ ఆలయ పూజారి భక్త మహళ్సాపతి పక్కన కాశీరామ్ షింపీ, అప్పారావ్ జోగ్లే అనే వారు కూడా ఉన్నారు. దివ్యతేజస్సుతో అక్కడే మర్రిచెట్టు కింద నిలబడి ఉన్న బాబాను చూసి మహళ్సాపతి ‘యాసాయి’ అంటే ‘రండి మహానుభావా’ అని ఆహ్వానించారు. ఇంతకు ముందు 1854లోనే షిరిడీ గ్రామానికి సాయిబాబా వచ్చారట. కొద్ది సమయం మాత్రం ఉన్నారట, ఆ తరువాత ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఈ ఖండోబా దేవాలయానికి మరో ప్రత్యేకత ఉంది. సాకోరిలో నివసించిన బాబా ముఖ్యభాక్తుడు ఉపాసనీ బాబా సాయి ఆజ్ఞ మేరకు ఇక్కడే మూడున్నర సంవత్సరాలు ఉన్నారు.
ఇవీ షిరిడీ వెళ్ళిన వారు తప్పక దర్శించవలసిన ప్రదేశాలు.

No comments: