Pages

Saturday, July 27, 2013

శ్రీ సాయి టీవీ – వెబ్ చానల్ ప్రారంభం



            

       శ్రీ సాయి టీవీ – వెబ్ చానల్ ప్రారంభం
ప్రతి గుండే పలుకు ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఇక ప్రతి గృహమూ ద్వారకా మాయి’
       వందలాది టెలివిజన్ ఛానళ్లు మన ముంగిట వినోదాన్నందిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం షిరిడీ సంతు సద్గురు సాయినాధ మహారాజు జీవితమూ, బోధనలపై ప్రత్యేకంగా ’శ్రీ సాయి టీవీ’ పేరిట 24 గంటల ఉపగ్రహ టెలివిజన్ ఛానల్ ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ సంవత్సరం మార్చి లో ఔత్సాహికులైన యువ సాయి భక్తులు కొందరు ’శ్రీ సాయిలీలా బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ని  హైదరాబాద్ కేంద్రంగా స్థాపించుకోవడం జరిగింది. వారికి సాయి తత్త్వం లో భీష్ములన దగిన ప్రముఖు ఆశీస్సులు లభించడంతో, తొలి మెట్టుగా ’శ్రీ సాయి టీవీ’ వెబ్ ఛానల్ ఆంధ్రప్ర్దదేశ్ శ్రీకాకుకుళం జిల్లాలోనే అతి పెద్ద మందిరం గా పేరొందిన శ్రీ సాయిబాబా ధ్యాన మందిరం, కాశీబుగ్గ-పలాసా లో శ్రీ గురు పూర్ణిమ శుభ దినాన 22.7.2013 వుదయం 10.33 నిముషాలకి సద్గురు సాయినాధ మహరాజ్ సాక్షిగా, వందలాది మంది సాయి భక్తుల సమక్షంలో, అవధూత రామిరెడ్డి తాతగారి పాదుకా దర్శనం తో పాటుగా సంవత్సరము వయస్సున బుల్లి సాయి భక్తుని చేతులమీదుగా అప్ లింక్ చేయబడింది. శ్రీ సాయిబాబా ధ్యాన మందిరం కార్యదర్శి శ్రీ జి. జయశంకర్ రెడ్డి దంపతులు, కోశాధికారి శ్రీ చలపతిరావు, మేనెజర్ ధుర్యోధన రౌత్, సాంబమూర్తి, బాడ భాస్కర్ తదితరులు, శ్రీ సాయి టీవీ సంచాలకుడు శ్రీ అనిల్ కుమార్ రాపాక, శ్రీ సాయి టీవి కన్సల్టంట్ శ్రీ చాగంటి సాయిబాబా, అవధూత రామిరెడ్డి సంస్థానం, కొల్లూరు కు చెందిన శ్రీ కృష్ణారావ్ మొదలుగాగల ప్రముఖులు ఛానల్ ప్రారంభొత్సవ కార్యక్రమములో పాల్గొని వెబ్ ఛానల్ సాధ్యమైనంత తొందరలో ఉపగ్రహ ఛానల్ గా రూపొంది తమ తమ గృహాలను ద్వారకా మాయి గా మారుస్తుందని తమ ఆశీస్సులను అందజేసారు.
       అంతకు ముందు రోజు కాశీబుగ్గ-పలాసా సాయి మందిర సముదాయంలో జరిగిన ఎలక్ట్రానిక్ మరియూ ప్రింట్ మీడియా ప్రతినిధులందరూ పాల్గొన్న ’మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో శ్రీ సాయి టీవీ సంచాలకుడు శ్రీ అనిల్ కుమార్ రాపాక, శ్రీ సాయి టీవీ సంయోజకుడు శ్రీ సి.సాయిబాబా, సాయి మందిరం కార్యదర్శి శ్రీ జి.జె.ఎస్.రెడ్డి, కోశాధికారి శ్రీ చలపతిరావు, అవధూత రామిరెడ్డి తాత సంస్థానమ్, కొల్లూరుకు  చెందిన శ్రీ కృష్ణారెడ్డి లు విలేఖరులనుద్డేశించి మాట్లాడారు. ’సాయి తత్త్వమ్ యువతలో మరింతగా ప్రాచుర్యత సాధించేందుకు ఈ వెబ్ ఛానల్ వుపయోగ పడుతుందని శ్రీ జి.జె.ఎస్.రెడ్డి అన్నారు. ’ఇంటింటీకీ సాయి తత్త్వాన్ని అందించాలనే బృహత్ లక్ష్యంతో ప్రారంభించిన ఈ ఛానల్ కి వనరులు సమకూర్చుకునే దిశలో శ్రీ సాయిప్రసన్న సొసైటీ ని రిజిస్టర్ చేసామని, పోషకులుగా, రాజపోషకులుగా, మహరాజ పోషకులుగా శ్రీ సాయిప్రసన్న సొసైటీ లో సభ్యులై సాయికొరకు, సాయి భక్తుల చేత, సాయి భక్తుల కొరకు, సాయి భక్తి వలన నిర్వహించబోయే ఈ ఛానల్ చైర్మన్ సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజే ననీ,  తన అనుమతి లేనిదే పత్రం కూడా కదలదన్న సాయిమహరాజ్ ఆదేశమే తమకు ఆదర్శమ’ నీ శ్రీ సాయి టీవి సంయోజకుడు శ్రీ సాయిబాబా చెప్పారు.


No comments: