Monday, June 17, 2013
All sins of many past births gets cleaned & washed away, by mere touch of the SadGuru's(Sai) hand. - Om Sai Ram courtesy by Sai ke Diwane
All sins of many past births gets cleaned & washed away, by mere touch of the SadGuru's(Sai) hand. - Om Sai Ram
Wednesday, June 12, 2013
భక్తుల పాలిట కల్పతరువు షిరిడీ సాయిబాబా
సాక్షాత్తు దేవతాస్వరూపుడైన షిరిడీ సారుుబాబా భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచారు. భారతీయ ఆధ్మాత్మిక గురువుగా, సాధువుగా, ఫకీరుగా విభిన్న అవతారాలలో భక్తులకు ఆయన దర్శనమిచ్చారు. ఆయన బతికున్న కాలంలో సారుుబాబాను ముస్లింలు ఫకీరుగా భావిస్తే హిందువులు సాధువుగా నమ్మారు. కానీ ఆయన తన జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి సహయోగం కుదర్చడానికి ప్రయత్నించారు. సారుుబాబా మసీదులో నివసించారు...గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు.
ఆయన రెండు సంప్రదాయాల పదాలను, చిత్రాలను ఉపయోగించారు. సారుుబాబా వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యం ‘అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఏక్’ అనేది బహుళ ప్రాచుర్యంలో ఉంది. దీనర్థం అందరి ప్రభువు ఒక్కరే అని. ఎక్కువమంది భక్తులు సారుుబాబాని శివుని, దత్తాత్రేయుని అవతారం అరుున సద్గురువుగా భావిస్తారు. ఇక షిరిడీ సారుుబాబా ఎక్కడ పుట్టారో, ఎప్పుడో పుట్టారో తెలియదు. కానీ ఆయన షిరిడీలో మహా సమాధి అరుున రోజు మాత్రం అకో్టబర్ 15,1918.
ఆయన రెండు సంప్రదాయాల పదాలను, చిత్రాలను ఉపయోగించారు. సారుుబాబా వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యం ‘అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఏక్’ అనేది బహుళ ప్రాచుర్యంలో ఉంది. దీనర్థం అందరి ప్రభువు ఒక్కరే అని. ఎక్కువమంది భక్తులు సారుుబాబాని శివుని, దత్తాత్రేయుని అవతారం అరుున సద్గురువుగా భావిస్తారు. ఇక షిరిడీ సారుుబాబా ఎక్కడ పుట్టారో, ఎప్పుడో పుట్టారో తెలియదు. కానీ ఆయన షిరిడీలో మహా సమాధి అరుున రోజు మాత్రం అకో్టబర్ 15,1918.
షిరిడీ సాయిబాబా బోధనల్లో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అదె్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, గురాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.
జీవిత చరిత్ర...
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడం లేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుపక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి. ఇక తన జన్మ, బాల్యం గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవారు. ఎందుకంటే ఎక్కడ పుట్టారో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు, వారిది ఈ మతం అని మనసులో నాటేసుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా బాబా తన పేరు, పుట్టిన ప్రదేశం గుర్తించి ప్రస్తావన చేయలేదు.
ఒకసారి తనకు ప్రియమైన అనుయాయుడైన మహాల్సాపతితో తాను ప్రతి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది. మరొకసారి ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్లు శిష్యరికం చేసినట్లు చెప్పాడంటారు. ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి. పదహారు సంవత్సరాల వయసులో సాయిబాబా మహారాష్టల్రోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చారని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం కనిపించలేదని, మళ్లీ ఒక సంవత్సరం తర్వాత (1858)లో ఆయన షిరిడీకి తిరిగి వచ్చారని అత్యధికులు విశ్వసించే విషయం. ఈ లెక్కన బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చని అంటారు.
యువకుడైన బాబా ఒక వేప చెట్టు కింద ధ్యానంలో రాత్రింబవళ్లు కూర్చొని ఉండేవారు. అతనిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్థులు బాబాను తరచు దర్శించేవారు. ఇక కొంతకాలం కనిపించకుండా పోయిన సమయంలో ఆయనెక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. అప్పుడు ఆయన చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని చెబుతారు. మరొకొందరు 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగిన మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చని అంటారు.
షిరిడీలో నివాసం...
1858లో చాంద్ పాటిల్ కుటంబపు పెళ్లివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర అతను బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి ‘దయ చేయుము సారుూ’అని పిలిచారు. తరువత ‘సాయి’ పదం స్థిరపడి ఆయన షిరిడీ సాయిబాబాగా ప్రసిద్దిలైనారు. ఇక 1918లో సమాధి అయ్యే వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసంగా చేసుకున్నారు. మసీదులో ధునిని వెలిగించేవారు. అందులో నుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు.
అది తమకు రక్షణనిస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చినవారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. ఆయన చాలా మహత్తులు చూపేంచేవారని భక్తులు చెబుతారు. ఇక బాబా స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒక్కోసారి బాబా విపరీతమైన కోపాన్ని ప్రదర్శించేవారు. 1910 తర్వాత దేశమంతటా సాయిబాబా పేరు తెలిసిపోయింది. గొప్ప మహత్తులు చూపే సాధువని లేదా దేవుడి అవతారమని విశ్వసించే భక్తులు ఎంతో మంది బాబా దర్శనానికి రాసాగారు.
సాయి బోధనలు...
షిరిడీ సాయిబాబా భక్తులకు ఎన్నో బోధనలు చేశారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంథ పఠనం చేయాలని చెప్పారు. రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయాలని హిందూ భక్తులకు ఉపదేశించారు. ఖురాన్ చదవమని ముస్లింలకు చెప్పారు. నీతి బద్దమైన జీవనం గడపమని, ఇతరులను ప్రేమించి సహాయం చేయమని బోధించారు. తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవరుచుకోమని పదే పదే చెప్పారు. అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు,సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలని ఉపదేశించారు. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అదె్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామయి అని పేరు పెట్టుకోవడం విశేషం.
మహా సమాధి...
షిరిడీ సాయిబాబా 1918 సంవత్సరం అక్టోబర్ 15 మధ్యాహ్నం 2.30కి తన భక్తుని ఒడిలో కన్నుమూసి మహా సమాధి చెందారు. ఆయన దేహాన్ని షిర్డీలో సమాధి చేసి మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరమే నేడు షిర్డీ సాయిబాబా దేవాలయంగా ఎంతో పేరుగాంచింది.
బాబా తన భక్తులకు 11 వాగ్దానాలు చేశారు. అవి...
- షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
- మందిరం మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
- నేనీ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా సచేతనంగా ఉంటాను.
- నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
- నా సమాధి నుండే నేను మీకు దర్శనమిస్తాను.
- నా సమాధి నుండి నేను మాట్లాడుతాను.
- నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
- మీరు నా వంక చూడండి. నేను మీవంక చూస్తాను.
- మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
- నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
- నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
Tuesday, June 11, 2013
మహిమానుభవాలు పంచుకుందాం ఆతర్వాత కూడా వున్నారు
మహిమానుభవాలు పంచుకుందాం
ఆతర్వాత కూడా వున్నారు
ఆర్థర్ ఆస్బర్న్ 1957 లో ఆంగ్లంలో వ్రాసిన ’ఇన్క్రెడిబుల్ సాయిబాబా’
పుస్తకం అప్పట్లో పాశ్చాత్యులకు సాయిని పరిచయంచేసిన తొలి పుస్తకంగా చెప్పుకోవచ్చు. పారాయణకు అనుగుణంగా ఏడు అధ్యాయాలున్న తెలుగులోనికి
శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారిచే అనువదించబడిన ’మహామహిమాన్వితులు సాయిబాబా – ఈ
కాలవు అద్భుత యోగి కధ’ అనే ఆ పుస్తకం చివర ’ఆ తర్వాత కూడా వున్నారు’ శీర్షికన
వున్న అధ్యాయం సాయి కృప షరతులు లేనిదనీ, అవధులులేనిదనీ మరోసారి గుర్తుచేస్తుంది. మనం ఇంకా ’If you look to me, I look to
you’ అనే ఏకాదశ సూత్రాలలో వ్రాసుకుంటున్నాం. ’నాయందు నీదృష్టి నిలిపితే, నీ యందు నా దృష్టి నిలుపుతాను’ అన్న అర్దంలో సాయి
కృపకి షరతులు ఆపాదిస్తున్నాము. కానీ ఈ అధ్యాయం చదివితే సాయి కృపకి షరతులులేవన్నది స్పష్టమవుతుంది.
1960 ప్రాంతంలొ మేము కలకత్తాలో 4 ఏళ్లు వున్న కాలంలో మాపొరుగు ప్లాట్ లో మిస్ డటన్
అనే వృద్ధురాలు వుండేది. ఆవిడ చాలా పవిత్ర వ్యక్తి. ఆవిడతో మా పరిచయం పెరిగిన తర్వాత తన వివరాలు కొన్ని చెప్పింది. ఆవిడ కొంతకాలం సన్యాసిని గా వుండెడిదట. జీవితంలో చాలా కాలం ఒక కాన్వెంట్ లో గడిపింది. రాగిరంగు జుట్టుగల చాలామంది లాగే, ఆవిడకూడా ఉద్రేక స్వభావమున్నది కావడం వలన, అక్కడి క్రమశిక్షణ ఆవిడకు నానాటికి ఇబ్బంది
కలిగిస్తూ వచ్చింది. దాంతో ఘర్షణలు మొదలయ్యాయి. అసంతుష్టి కలిగింది. టూకీగా చెప్పలంటే ఆవిడ ఇతర సన్యాసినులతో స్నేహంగా వుండలేక పోయింది. చివరికి, తానిక ఏ మాత్రం భరించలేని స్థితికి వచ్చింది. పై అధికారుల సహకారంతో ఆవిడ తాను చేసిన ప్రమాణాల
నుండి విముక్తి కోసం పోప్ కు విన్నవించుకుంది. అట్టే ఆలస్యం కాకుండానే ఆవిడ విన్నపం మంజూరైంది. ఆవిడ విన్నపం పరిశీలనలో వున్న కాలంలో తానున్న
మానసిక స్థితిలో తన భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించలేకపోయింది. కాన్వెంటు విడిచి వెళ్లేముందు ఆవిడకు, తన భవిష్యత్తు ఇప్పుడు ఎంత నిరాశాజనకంగా వుందో
తెలిసివచ్చింది. నడి వయస్సు దాటిపోయింది. జీవన వృత్తి లేదు. చుట్టాలన్నవాళ్లు దాదాపు లేనట్టే. దగ్గర బంధువు ఒకడు ఎక్కడో దూరాన వున్నాడు. ఒక నాడు ఆమె తన చిన్న గదిలో అత్యంత గాఢమైన విచారంలో
మునిగి వుండగా హఠాత్తుగా పొడుగాటి ఫకీరు ఒకాయన ప్రత్యక్ష్యమయ్యారు. ఆయన లోపలికి ఎలా వచ్చారో ఆమె చెప్పలేక పోయింది. ఒక సన్యాసిని గదిలోకి ముస్లీం ఫకీరు ప్రవేశించగలగడం
సంభవమయే విషయం కాదు. కారుణ్యంతో ఆమె వైపు చూసి ఆయన ఇలాగ అన్నారు: “అంతగా విచార పడకు. నువ్వు కలకత్తా వెళ్ళిన తర్వాత అంతా చక్కబడుతుంది”. ఆ తరువాత ఆయన దక్షిణ ఇమ్మని అడిగారు. తన దగ్గర డబ్బేమీ లేదని ఆవిడ చెప్పింది. “ఉంది. అక్కడ అలమారులో వున్న పెట్టెలో ముప్పై ఐదు రూపాయలున్నాయి” అన్నారాయన. ’వాటి సంగతి నేను పూర్తిగా మరిచే పోయాను’ అని నాతో
అన్నారావిడ. ఆ డబ్బు తేవడానికి ఆవిడ అలమారు దగ్గరకు వెళ్లింది. డబ్బు వుంది. దక్షిణ ఇద్దామని వెనక్కి తిరిగి చూసేసరికి ఆఫకీరు అక్కడ లేరు. ఆయన వచ్చిన తీరుగానే అదృశ్యమయారు. ఆవిడకి ప్రశాంతి కలిగింది.
కలకత్తాలో ఆవిడ బంధువు ఆవిడని ఆదరంతో పలుకరించాడు. అప్యాయంగా, జాగ్రత్తగా ఆవిడని సంరక్షించడమే కాకుండా, ఆవిడ పెంపుడు జంతువులని కూడా అలాగే సంరక్షించాడు. ఇప్పటికీ బహుశః అలాగే ఆవిణ్ణి సంరక్షిస్తూ
వుండవచ్చు. మిస్ డటన్ అతన్ని ఎంతగానో పొగుడుతుంది. అతనికెంత కృతజ్ఞురాలంటే చర్చికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని ధన్యవాదాలు
తెలుపుకోడానికి ఆవిడ ప్రతిరోజూ వేకువకు ముందే నిద్రలేచేది. ఈ క్రమశిక్షణ ఆవిడకు ఎంతో సంతోషం కలిగించేది.
“మీ ఫకీరు బొమ్మ నేను చూపిస్తాను’ అన్నాను ఆవిడతో. ఆయన మహామహితాన్వితులయిన సాయబాబా గారు తప్ప మరొకరు
అయి వుండరన్న నమ్మకం అప్పటికే నాకు కలిగింది. అదృష్టవశాత్తూ నేను ప్లాటు లోంచి సాయిబాబా గారి పటం తీసికివచ్చి ఆ ముసిలావిడకి
చూపించాను. చూస్తూనే ఆవిడ సంభ్రమాశ్చర్యాలతో ఇలా అంది ’ఈయనే నా ఫకీరు. తలకు అచ్చంగా ఈ తెల్లగుడ్డే వుంది”..
ఆవిడ అంతకుముందెన్నడూ సాయిబాబాగారి పేరు వినలేదు.
సాయికృపతో
సాయి పాదధూళి చాగంటి సాయిబాబా, ఒడిషా.
Subscribe to:
Posts (Atom)



