Pages

Wednesday, August 21, 2013

సాయిబాబా భక్త సులభుడు....

సాయిబాబా భక్త సులభుడు. పిలిస్తే పలికే దైవం సాయిబాబా. బాబా పూజకు ఎలాంటి ఆడంబరాలూ అక్కర్లేదు. తిధి, వార, నక్షత్రాలు చూడనవసరం లేదు. తేదీలతో, దిక్కులతో సంబంధం లేదు. వర్ణ, వర్గాలతో నిమిత్తం లేదు. సాయిబాబా పూజ ఎవరైనా, ఎపుడైనా ప్రారంభించవచ్చు. సాయిబాబా పూజకు ఏ హంగులూ, ఆర్భాటాలూ అవసరం లేదు. ఫలానా సామగ్రి కావాలని, ఫలానా విధంగా పూజ చేయాలని నియమాలు, నిబంధనలు లేవు.
సాయి బాబా పూజకు కావలసిందల్లా భక్తిభావన. సాయిబాబా లీలలు పారాయణం చేయాలనుకుంటే గురువారం ప్రారంభించడం శ్రేష్టం. ఎందుకంటే షిర్డీ సాయి బాబాకు ఇష్టమైన రోజు గురువారం. అలాగే బాబాకు ప్రియమైన నైవేద్యం పాలకోవా కనుక, పూజలో పాలకోవా నైవేద్యంగా సమర్పించి నలుగురికీ పంచవచ్చు. సాయిబాబా చరిత్ర, సాయిబాబా లీలలు మొదలైన పవిత్ర గ్రంధాలను పారాయణ చేయదలచుకున్నవారు గురువారం నాడు ప్రారంభించి, బుధవారం నాటికి ముగించవచ్చు.
ఒక వారంలో పూర్తిచేయలేనివారు రెండు, లేదా మూడు వారాల్లోనూ పూర్తిచేయవచ్చు. నిత్య పారాయణ కూడా చేయవచ్చు. కానీ పారాయణ చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి ముఖ్యం. సాయిబాబాకు భక్తిగా రెండు కాసులు సమర్పించాలి. అందులో మొదటిది నిష్ఠ, రెండోది సబూరి. ఇవి మాత్రమే సాయిబాబా తన భక్తుల నుండి ఆశించేది. అలాగే పారాయణ పూర్తయ్యాక రెండు రూపాయలకు తక్కువ కాకుండా బాబా ట్రస్టుకు దక్షిణ పంపాలి. సాయిబాబా గ్రంధాలను పారాయణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాయిబాబా భక్త సులభుడు. భక్తిగా ప్రార్ధిస్తే మన చెంతనే ఉంటాడు.

సాయి పథమే సత్యం....సాయితత్వమే శాశ్వతం

ఒక భక్తుడు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ షిర్డీ చేరుకున్నాడు. షిర్డీ సాయినాథుడు నడిచిన పుణ్యభూమి కదా! బాబా కర, పాద స్పర్శలతో ఆ నేల అణువణువూ పవిత్రతను సంతరించుకుంది. ఆ యాత్రికుడి మనసు పులకరించింది. గొప్ప శాంతి కలిగింది. ఆ ఆనందంతో చెట్టు నీడన కూర్చున్నాడు. వెంటనే నిద్రకమ్ముకొచ్చింది.
"చక్కని పాన్పు ఉంటే కమ్మగా నిద్రపోదును" కదా! అనుకున్నాడు. షిర్డీలో ప్రతిచెట్టూ కల్పవృక్షమే కదా ! సాయి అనుగ్రహ బలం వల్ల అతను కూర్చున్న చెట్టు అతని కోరికను తీర్చింది. వెంటనే హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై హాయిగా పడుకుని, "అలసిపోయి ఉన్నాను. ఎవరైనా వచ్చి కాళ్లు వత్తితే ఎంత బాగుండు?" అనుకున్నాడు. వెంటనే ఆ కోరిక తీరింది. కొద్ది సేపటికి అతనికి ఆకలి పుట్టింది, "భోజనం చేస్తే బావుంటుంది" అనుకున్నదే తడవుగా పంచభక్ష పరమాన్నాలు అతనికి విందు చేసాయి.
"దేవుడు ఇన్ని భోగాలు ఇచ్చాడు భాగ్యం కూడా ఇస్తే నా చింత తీరిపోయినట్టే" అనుకున్నాడు. క్షణాల్లో ధనధాన్యాలు అక్కడ రాశులై వెలిశాయి. తలవటమే పాపం అన్నీ జరిగిపోతుండే సరికి ఆ భక్తునికి మతిపోయింది. తానున్నది షిర్డీలో అని కాని, అది ఒకప్పుడు బాబా పాదం మోపిన పవిత్ర నేల అని కాని, బాబా అనుగ్రహ బలం వల్లే తనకు నీడనిచ్చిన చెట్టు కల్పవృక్షమై కోరికలు తీరుస్తోందని కాని ఆ భక్తుడు గ్రహించలేకపోయాడు.
కొద్దిసేపు భోగ,భాగ్యాలు అనుభవించే సరికి అతనిలో వ్యామోహం పుట్టుకొచ్చింది, ఏమైనా సంపదంతా సొంతం కావాలనే స్వార్థం, దానిని ఎవరైనా కొల్లగొట్టుకుపోతారేమోననే భయం, సంపద వచ్చింది వచ్చినట్టే పోతే ఏం చేయాలి దుఃఖం మొదలైంది.
తనలో కలిగే ఆలోచనలకు తగ్గట్టే "ఇప్పుడు దొంగలు వచ్చి ఈ సంపదను దోచుకుపోరు కదా?" అనుకున్నాడు. అలా అనుకోవటమే పాపం...నిజంగానే దొంగలు వచ్చి కూర్చున్నారు. బెదిరిపోయిన భక్తుడు వెంటనే "దేవుడా! వీళ్ళ పీడా విరగడ చేయి" అని ప్రార్థించాడు.
ఇప్పుడు ఆ భక్తుడిలో ప్రాణభయం మొదలైంది. "ఈ ధనాన్ని కాపాడుకోవాలి! ఇంకా ఎక్కువ కాలం జీవించాలి. ఈలోపుగా ప్రాణం పోతే ఎలా? ప్రాణం పోదుకదా!" అనుకున్నాడు. అనుకున్నంతా అయింది. ఎదురుగా యమదూతలు నిలిచారు. భక్తుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. మనసులో భయం తప్ప మరో ఆలోచన లేకపోయింది. ప్రాణం ఉగ్గబట్టి కళ్ళుమూసుకున్నాడు. అతనున్నది షిర్డీలో భక్తులు ఆపదల బారిన పడితే బాబా చూస్తూ ఊరుకోరు కదా! బాబా ప్రాణభిక్ష పెట్టి భక్తుడిని కాపాడారు. భక్తుడికి జ్ఞానోదయం అయింది.
లోకుల రీతి ఇలాగే ఉంటుంది. భగవంతుడు కల్పతరువు. మనం ఏం కోరినా అనుగ్రహిస్తాడు. అయితే, మన కోరికల్లోని మంచెంతో, చెడెంతో మనమే ఆలోచించుకోవాలి. జీవితంలో తృప్తి చెందటం, కోరికలు తీరటం, వ్యామోహం వీడటం ఈ జన్మకి జరగనివి. మనం భగవంతుడిని అంతులేని సంపదలు, సుఖాలు ప్రసాదించమని కోరుకుంటాం. చివరకు ఏమౌతుంది? వాటిపై పెంచుకున్న వ్యామోహం భయానికి, దుఃఖానికి కారణమవుతుంది. మనం కోరుకునే ప్రతి భౌతిక కోరిక వెనుక ఓ పెద్దపులి దాగి ఉంటుంది. అది చివరకు భయాన్ని దుఃఖాన్ని మిగిలిస్తుంది. కాబట్టి చిన్నా, చితకా కోరికలు తీర్చమని బాబాను వేడుకుంటూ మనలోని శక్తిని దుర్వినియోగం చేసుకోవటం ఎందుకు? ఏకంగా సాయినాథుడి అనుగ్రహాన్నే కోరుకుందాం. సాయి అనుగ్రహమే శాశ్వతం. మిగతావన్నీ ఈరోజు ఉండి రేపు వెళ్లిపోయేవే! సాయితత్వమే శాశ్వతం. మనం దానినే ఎంచుకుందాం. సాయిపథంలో నడుద్దాం. సాయి చెప్పిన మంచి మాటలను ఆలకిద్దాం. వాటిని ఆచరించి జీవిత పరమార్థాన్ని సాధిద్దాం.

Baba at Homam

Baba at Homam
Some one from Karnataka, had a 108 days of "Sai Chanting" ( Sai Deeksha ) and the last day they performed "Homam" .
Wonder!!! Sai baba made his presence during pooja performed by the family for 108 days....
They found "Sai Baba" attended and wished them . {Actually these pictures has taken from the " Mobile " , and the
This was the wonderful experience given to the Sai Devotees from Baba...
Baba will always with us ..... Only thing we should have a strong belief .......
People who never believe in god.... Can realize with this photograph...

the beautiful image of the Shri Sai along with Shri Vibhuthi Baba at Thiruvannamalai