Pages

Saturday, April 20, 2013

సాయితత్వ రహస్యం. (secret of Sai thatwam)




మానవాళికి భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం శ్రీ సాయి. శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు . శ్రీ సాయి అలా జీవించి చూపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నోసమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం సాయితత్త్వం. చిక్కులో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయుతనిచ్చి సేద తీర్చే సాధనం సాయితత్త్వమే. మానవాళికి ఉద్దరణ కోసం, మనిషిగా మానవత్వంలో ఎలా బతకాలో చెప్పటం కోసం శ్రీ సాయి తన కాలాన్ని మొత్తం వెచ్చించారు. పూజా విధులు, పురస్కార తంతులు, విధి విధానాలు ... బాబాకు వీటితో పనిలేదు. శ్రద్ధ , సహనం ...ఇవి రెండే భక్తుల నుంచి కోరిన బాబా, వాటిని ఆచరించిన వారికి తన ప్రేమను పంచారు. సాయి ఆదర్శ జీవన విధానం మనవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి . ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం
     సాయితత్వాన్ని నిత్యజీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతు౦ది జీవితం ధన్యమవుతుంది .సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది. శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు . స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్ధ సద్గురు అయ్యారు .మనిషి జీవిత పరమార్ధం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి ?ఇదంతా బాబా ఆచరించి చూపారు .ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమకర్తవ్యం కదా! బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాలను చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయమనే క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్దులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి. షిరిడి సాయిబాబా యుగావతరం. నేడు ప్రపంచ౦ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకుశ్రీ సాయి సచ్చరిత్రలో పరిష్కారం లభిస్తుంది.

శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం



శ్రీ  సాయి  కష్ట  నివారణ  స్తోత్రం


ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ  నమః
ప్రథమం  సాయినాథాయ  నమః  -  ద్వితీయ  ద్వాఆజాయ  -  రకామాయినే
తృతీయం  తీర్థ  రాజాయ  –  చతుర్థం  భాక్తవత్సలే
పంచమం  పరమార్థాయ  –  షష్టించ  షిర్డీ  వాసనే
సప్తమం  సద్గురు  నాధాయ  –  అష్టమం  అనాథ  నాధనే
నవమం  నిరాడంబరాయ  –దశమం  దత్తావతారమే
యతాని  దవమానాని  త్రిసంధ్యపదే  నిత్యం
సర్వకష్ట  భయోన్ముక్తో  సాయినతగురు  కృపా
(  సాయినాథ  కష్టనివారణ  స్తోత్రం  రోజుకు  3  సార్లు  11  పర్యాయములు  ఎవరు  పఠిస్తారో  వారి  సర్వ  కష్టాలు  తొలుగును)

సాయిబాబా కటాక్షం కోసం ప్రమిదలు వెలిగిస్తే



షిరిడీ సాయినాధునికి నూనెతో దీపాలు పెడితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని జ్యోతిష్యనిపుణుల చెబుతున్నారు. పూర్వం ప్రతిరోజూ సాయంత్రం ద్వారకామాయిలో సాయిబాబా దీపాలను వెలిగిస్తుండేవాడు. ఊరిలో ఉన్న వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి, భిక్షాటన చేసి, నూనెతో దీపాలను వెలిగించే వారు. అయితే ఒకరోజు వ్యాపారస్తులందరూ కలిసి బాబాకు నూనెను ఇవ్వడాన్ని మానుకున్నారు. బాబా నూనె కోసం వస్తే అందరూ నూనె లేదని చెప్పడం ప్రారంభించారు. విషయం గమనించిన బాబా నిరాశ చెందకుండా ద్వారకామాయికి చేరుకున్నారు. కుండలోని మంచినీటిని తీసుకుని గిన్నెలో పోసి, నీటిని ప్రమిదలలో పోసి దీపాలను వెలిగించారు. ఇది గమనించిన వ్యాపారులకు, సాయిబాబాను పరీక్షించాలనుకున్న కొందరు ప్రజలకు, సాయిబాబా దైవాంశభూతుడన్న నమ్మకం ఏర్పడింది.  బాబా ఎప్పుడూ నూనెతోనే మసీదులో దీపాలను వెలిగించేవారు. కిరోసిన్ దొరికేది కానీ, ఏరోజు కూడా బాబా కిరోసిన్తో మసీదులో దీపాలను వెలిగించలేదు. నూనెతో వెలిగించిన దీపాలు స్థిరంగా ఉండి వెలగడంతోపాటు, వాటి వెలుగు శాంతంగా, ఆహ్లాదకరంగా ఉండి భక్తుడి మనస్సును ఏకాగ్రతతో భగవంతుడిపైన కేంద్రీకరించడానికి వీలు ఉండటం వల్ల, బాబా ఎప్పుడూ నూనెతోనే దీపాలను వెలిగించేవారు.  అందుచేత ప్రతి గురువారం నూనెతో దీపారాధన చేసి సాయిబాబాను ప్రార్థించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా సాయిబాబా కటాక్షం కోసం గురువారం సాయంత్రం నూనెతో గానీ, నెయ్యితో గానీ దీపారాధన చేస్తే సఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.